నిర్లక్ష్యం ఖరీదు 3వేల చెట్లు, ₹300 కోట్లు!
NEWS Oct 06,2026 10:20 am
హైదరాబాద్: మల్టీ బ్రిడ్జిలు కడుతామంటూ కేబీఆర్ పార్కు ప్రాజెక్టు విషయంలో అధికారుల నిర్లక్ష్యం తీరని నష్టాన్ని మిగిల్చింది. గడిచిన 6 నెలల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల కోసం ఇంజినీర్లు పార్కు చుట్టూ 3వేల చెట్లను తొలగించారు. అభివృద్ధి పనుల కోసం చేపట్టిన అధ్యయనం, భూ పరీక్షలు, తవ్వకాలు, ఇతరత్రా పనులకు సుమారు రూ.300 కోట్లు వెచ్చించారు. చివరికి ట్రాఫిక్ సమస్య పరిష్కరమైందంటూ KBR పార్క్ చుట్టూ తలపెట్టిన మల్టీ బిడ్జి ప్రాజెక్టును రద్దు చేశారు.