ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
NEWS Oct 05,2026 01:12 pm
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని వెలిగించే అక్షర కిరణం ఉపాధ్యాయుడని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలు చెప్పడం మాత్రమే కాదని, జీవిత పాఠాలు నేర్పించే జీవన మార్గదర్శి అని తెలిపారు. ఎన్ని సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చినా ఉపాధ్యాయుడి స్థానాన్ని, మార్గదర్శకత్వాన్ని ఎన్నటికీ భర్తీ చేయలేవని అన్నారు.