మున్సిపాలిటీ ఎన్నికల్లో సీనియర్ల ప్రచారం
NEWS Feb 07,2026 09:02 am
నిర్మల్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడానికి సీనియర్ నాయకులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. 4 రోజుల నుండి జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జుతో పాటు సీనియర్ నాయకులు మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వాడవాడలా తిరుగుతూ సంబంధిత అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.