రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ
NEWS Apr 09,2025 12:05 pm
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బుధవారం రెపో రేటు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. గతంలో ఉన్న 6.25 రెపో రేటును 6.00కి తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీని కారణంగా గృహ, వాహన, వ్యక్తిగత, ఇతర రుణాల విషయంలో కొంత వెసులుబాటు కలగనుంది. మానిటరీ పాలసీ కమిటీ తక్షణమే అమలులోకి తీసుకు వచ్చేలా రెపో రేట్ ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించామన్నారు.