ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
NEWS Apr 09,2025 09:15 am
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు కు చెందిన పాస్ పోర్ట్ రద్దు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రభాకర్ రావు పై ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. పాస్ పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు లభించదు. దీంతో అమెరికా కాన్సులేట్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు స్పీడ్ పెంచారు పోలీసులు.