జగన్ రెడ్డికి ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
NEWS Apr 09,2025 08:09 am
పోలీసుల బట్టలు ఊడదీసే రోజు తప్పకుండా వస్తుందంటూ సంచలన కామెంట్స్ చేసిన మాజీ సీఎం జగన్ రెడ్డిపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. పోలీసులు భగ్గుమంటున్నారు. తన నోటి దూలను మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. తాజాగా రామగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి. సుధాకర్ యాదవ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మా బట్టలు ఊడదీసే దమ్ము నీకుందా..కష్టపడి చదివి, పోటీ పరీక్షల్లో నెగ్గి తెచ్చుకున్న పోస్ట్ ఇది అన్నారు. ఎవడో వచ్చి ఊడ దీసేందుకు ఇది అరటి తొక్క కాదంటూ నిప్పులు చెరిగారు.