ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం
NEWS Apr 08,2025 09:57 am
ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. మంగళవారం శ్రీకాకుళంలోని పలాస సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు బోగీల క్లిప్పింగ్స్ విడి పోయాయి. ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ఘటన జరిగిన వెంటనే రైల్వే శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. జాయింట్ పనులను ముమ్మరం చేశారు.