మాజీ ఎమ్మెల్యేతో బంధం అబద్దం
NEWS Apr 08,2025 07:57 am
డియర్ ఉమ సినిమా నిర్మాత, హీరోయిన్ సుమయరెడ్డి సీరియస్ గా స్పందించింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డితో తాను రిలేషన్ లో ఉన్నానంటూ జరుగుతున్న ప్రచారంపై మండిపడ్డారు. తమ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో అనుబంధం ఉందన్నారు. తామిద్దరిపై లేని రిలేషన్ ను సృష్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ వాపోయింది హీరోయిన్. ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్న విషయాన్ని వీడియో తీసి , ఫోటోలను షేర్ చేస్తూ తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా చేస్తున్నారంటూ వాపోయింది. దయచేసి వాస్తవాలు తెలుసుకుని కామెంట్స్ చేయాలని సూచించారు.