ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై ఎమ్మెల్సీ ఫైర్
NEWS Apr 08,2025 07:50 am
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు కాంగ్రెస్ కార్యకర్తలను వేధించి కేసులు పెట్టించాడని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేశాడని, పవర్ పోగానే తమ పార్టీలోకి చేరాడని ధ్వజమెత్తారు. ప్రస్తుతం తమ పార్టీని అడ్డం పెట్టుకుని మళ్లీ పెత్తనం చేస్తున్నాడంటూ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో సీఎం వల్ల అధికారం రాలేదని కార్యకర్తలు, నాయకులు చేసిన కృషి వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.