మాజీ డిప్యూటీ సీఎం సోదరుడికి రిమాండ్
NEWS Apr 07,2025 07:18 pm
మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ భాషాను అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. విచారణకు ముందు కడప రిమ్స్ లో వైద్య పరీక్షలు చేపట్టారు. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం నుంచి ప్రత్యేక వాహనంలో తరలించారు. మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. స్థల వివాదం, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డిపై అహ్మద్ భాషా షాకింగ్ కామెంట్స్ చేశారు ఆనాడు జగన్ రెడ్డి పాలనలో. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు.