ఎమ్మెల్సీగా కొలువు తీరిన రాములమ్మ
NEWS Apr 07,2025 02:34 pm
ఎమ్మెల్సీగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు నటి విజయశాంతి. ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రాములమ్మతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా విజయ శాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై నమ్మకం ఉంచిన హై కమాండ్ కు రుణపడి ఉంటానని అన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానంటూ చెప్పారు.