కేఎల్ యూనివర్శిటీ కేసుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ బృందాలు సోదాలు చేపట్టాయి. రేటింగ్ కోసం లంచాలు ఇవ్వచూపడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. న్యాక్ సభ్యులతో సహా మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. కేఎల్ఈఎఫ్ యూనివర్శిటీ రేటింగ్ కోసం భారీగా ముడుపులు ముట్ట చెప్పారు. బంగారు నాణేలు, భారీగా నగదు, ఖరీదైన ఫోన్స్ , ల్యాప్ టాప్ లు పెద్ద ఎత్తున లంచంగా ఇచ్చారు. న్యాక్ బృందంలో టాప్ యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు ఉండడం విస్తు పోయేలా చేసింది.