మహిళా సంఘాలకు కొత్త సారథుల ఎంపికలు
NEWS Feb 02,2025 07:55 am
గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాలకు కొత్త సారథులు రానున్నారు. సంఘ సభ్యులతోపాటు గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులతోపాటు కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారులను ఎన్నుకునేందుకు కామారెడ్డి జిల్లా సెర్ప్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నూతనంగా గ్రామ, మండల, జిల్లా సమాఖ్య సభ్యులను ఎన్నుకునే తీరుపై ఇది వరకే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు ఏపీఎం, సీసీలకు తగిన శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అధికారులు మహిళా సంఘాల సభ్యులతో పాటు వీవోఏలకు విడతల వారీగా అవగాహన కల్పించారు.