హైదరాబాద్ వేదికగా ప్రిజం పబ్ లో జరిగిన కాల్పుల ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తన కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పోలీసులు గత రెండు సంవత్సరాల నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. చాలాసార్లు తప్పించుకుని తిరుగుతున్నాడు. పబ్ లో ఉన్న విషయం తెలుసుకున్న వెంటనే సెర్చింగ్ చేపట్టారు. ఖాకీలు ఎంటరైన వెంటనే కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు.