కేటీఆర్..హరీశ్ హౌస్ అరెస్ట్
NEWS Jan 14,2025 04:12 am
మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్ రావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం రాచరిక పాలన సాగిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి నియంత లాగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ప్రజా పాలన పేరుతో ప్రజలపై నిర్బంధ పాలన సాగిస్తుండడం బాధాకరమన్నారు. ఎన్ని కేసులు బనాయించినా , అరెస్ట్ లు చేసినా తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, సర్కార్ ను ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు కేటీఆర్, హరీశ్ రావు.