మెట్‌పల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్
NEWS Dec 31,2024 01:55 pm
మెట్‌పల్లిలో సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతోంది. డిసెంబర్ 31 సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్రోలింగ్, బ్లూ కోర్ట్ టీం యధావిధిగా పట్టణంలోని, వీధులలో, రోడ్లపై తిరుగుతూనే ఉంటాయని, ఓపెన్ ప్లేస్ లలో డీజే లు, ఫంక్షన్ హాల్‌లో డీజేలు పెట్టుకుని కేక్ కటింగ్ ప్రోగ్రాంలు పెట్టుకోవద్దని, వాటికి ఎలాంటి పర్మిషన్ లేవన్నారు. ఇంట్లోనే నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.