వృత్తి పరమైన పరిమితిని పెంచాలి
NEWS Dec 24,2024 06:19 am
కర్టాటక రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరె గౌడ వృత్తిపరమైన పన్ను పరిమితిని పెంచాలని ప్రతిపాదించారు. ప్రతి ఏటా రూ. 2,500 నుండి రూ. 6,000కి పెంచేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 276ను సవరించాలని సూచించారు. ద్రవ్యోల్బణం, దశాబ్దాల ఆర్థిక వృద్దిని ప్రస్తావించారు. ప్రస్తుత పరిమితి పాతదని, దాని వాస్తవ విలువ గణనీయంగా క్షీణించిందని పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాలు కూడా కర్ణాటక డిమాండ్ కు మద్దతు ఇస్తున్నాయి.