జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత కూడలి వద్ద రైతులు, భారతీయ కిషన్ సంగ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన హామీలను నెరవేర్చాలని వారు అన్నారు. అనంతరం చలో కామారెడ్డి తరలి వెళ్లారు.