కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
NEWS Jul 26,2026 09:22 am
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. కడియం శ్రీహరిపై కీలక వాఖ్యలు చేశారు. కడియంకు ఎలాంటి నైతిక విలువలు లేవని, అతనికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పుకునే అర్హత లేదన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలన్నారు.