ప్రభుత్వ మరియు ప్రైవేటు జూనియర్ కళాశాలలకు జిల్లా 6 నుంచి 13 తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం శనివారం ప్రకటనలో తెలిపారు. దసరా సెలవుల్లో ఏవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 14వ తేదీన తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.