మెదక్ జిల్లాలో మంత్రాల పేరుతో రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి. నెల వ్యవధిలో 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఆరుగురిపై దాడి చేయగా, ఒకరిని దారుణంగా కొట్టి హత్య చేశారు. తాజాగా నిన్న మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇంత జరుగుతున్న మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా అధికారులు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.