జ్వరంతోనే వారాహి సభకు పవన్
NEWS Oct 03,2024 07:27 am
ఈ సాయంత్రం తిరుపతిలో పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కాలినడకన వెళ్ళినప్పుడు పవన్ వెన్ను నొప్పితో బాధపడ్డారు. దీంతో అతిధి గృహంలోనే డాక్టర్లు పవన్ కు వైద్య సేవలందిస్తున్నారు. అయితే జ్వరంతో బాధపడుతున్న పవన్.. వారాహి సభలో పాల్గొంటారని తెలుస్తోంది. పవన్ త్వరగా కోలుకోవాలని జనసైనికులు కోరుకుంటున్నారు.