తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
NEWS Jun 15,2026 09:14 am
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మెట్ పల్లికి చెందిన రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్,లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. బెజ్జారపు మధుసూదన్, అంగారి శంకర్ ఇద్దరు పరారీలో ఉన్నారని సిఐ సురేష్ బాబు తెలిపారు.