సిద్దిపేట పట్టణంలోని పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. వాసవి క్లబ్స్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కార్యక్రమంలో సిద్దిపేట వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో దుప్పట్లను పంపిణీ చేసినట్లు అధ్యక్షురాలు మర్యాల వాణి వివరించారు. కార్యక్రమంలో కవిత, ఉమారాణి, జయలక్ష్మి, అనిత, పద్మ పాల్గొన్నారు.