కొత్త రేషన్ కార్డుల ఆదాయ పరిమితిపై ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పట్టణ, గ్రామీణం అన్నిచోట్ల ఒకే విధంగా రూ.2 లక్షలుగా నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం BPL కుటుంబాలకు ఆదాయ పరిమితి గ్రామాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలుగా ఉందని చెప్పారు.