మేడారం జాతరలో ధరలు మెండు
NEWS Jan 30,2026 10:31 am
మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచారు. బయట కేజీ మటన్ ధర ₹900-1000 ఉండగా, మేడారంలో ₹1500 కి అమ్ముతున్నారు. కిలో లైవ్ కోడి బయట ₹170 ఉండగా, జాతరలో ₹350కి విక్రయిస్తున్నారు. ఒక్కో మద్యం బాటిల్‌పై ₹100 చొప్పున పెంచినట్లు తెలుస్తోంది. తోటల్లో నీడ కోసం వెళ్లే వారికి ఒక్కో చెట్టును ₹1000-₹2000కి అద్దెకు ఇస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు.