లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసిన రేవంత్
NEWS Jan 30,2026 11:14 am
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు ‘లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ పేరిట నిర్వహించిన క్లాసులకు ఆయన హాజరయ్యారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి క్లాసులకు హాజరైనట్లు.. టీచర్స్, తోటి విద్యార్థుల నుంచి ఎంతో నేర్చున్నట్లు తెలిపారు.