భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
NEWS Jan 30,2026 11:08 am
జనవరి 30న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా ₹8,230 తగ్గగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై ₹7,550 తగ్గింది. ఇక తగ్గింపు తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹1,70,620 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల ధర ₹1,56,400 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర ₹4,25,100 వద్ద ట్రేడవుతోంది. ఇది హైదరాబాద్‌లోని ధర. ఇక ఇతర ప్రాంతాల్లో ₹3,95,000 వద్ద కొనసాగుతోంది.