అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిచిగాన్ ర్యాలీలో ప్రసంగిస్తూ.. త్వరలో ప్రధాని మోడీని కలుస్తానని చెప్పారు. అయితే ర్యాలీలో భారత్ వాణిజ్య విధానాన్ని ట్రంప్ విమర్శించారు.. అదే సమయంలో ప్రధాని మోడీని అద్భుతమైన వ్యక్తి అంటూ కొనియాడారు. వచ్చే వారం మోడీ తనను కలవడానికి వస్తున్నారని ట్రంప్ అన్నారు. 23న యూఎన్ సమ్మిట్ ఫర్ ది ఫ్యూచర్ కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు.