డుంబ్రిగుడలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గుంటసీమ రోడ్డుకు ఆనుకుని ఉన్న దుకాణాలను తొలగించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. దశాబ్దాలుగా తమను ఆదుకున్న దుకాణాలను తొలగించడంతో చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం చెల్లించకుండా తొలగిస్తుండటంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి నష్ట పరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు.