మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొల్లూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై రాజేందర్ దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.9,210 నగదుతో పాటు 5 సెల్ ఫోన్లు, 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.