గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథులు
NEWS Sep 18,2024 06:25 am
జైపూర్ మండలం ఇందారం గ్రామ పంచాయతీ పరిధిలోని గోదావరి నదిలో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. వంతెన మీద నుంచి భారీ క్రేనుల ద్వారా గణేష్ విగ్రహాలను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని ఏసిపి వెంకటేశ్వర్, శ్రీరాంపూర్ సీఐ మోహన్, జైపూర్ ఎస్సై శ్రీధర్, ఎంపీవో శ్రీపతి బాపురావు, పంచాయతీ కార్యదర్శి సుమన్, తదితరులు పర్యవేక్షిస్తున్నారు.