మంచిర్యాల పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను మంగళవారం రాత్రి రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ పరిశీలించారు. డిసిపి ఏ. భాస్కర్ తో కలిసి నిమజ్జనం శోభాయాత్ర బందోబస్తు పర్యవేక్షించారు. శోభయాత్ర జరుగుతున్న ప్రాంతాలలో అధికారులతో కలిసి తిరుగు నిమజ్జన ప్రక్రియ అయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాలని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు.