అల్లూరి జిల్లా పాడేరు నుంచి గిరి విద్యార్థుల విజ్ఞాన యాత్ర బస్సును కలెక్టర్ దినేశ్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. 32 మంది విద్యార్థులతో ఈ యాత్ర నిర్మాణ్ పేరుతో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఇండస్ట్రియల్ కంపెనీలు తిలకించేందుకు పోలీస్ శాఖ ఈ టూర్ ఏర్పాటు చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యం ప్రతిభపాటవాలు, నాలెడ్జ్ తెలుసుకునేందుకు టూర్ ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.