ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు, అమరవీరుల స్థూపానికి పూల గుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికామన్నారు. సమరయోధులందరికీ జోహార్లు అర్పించారు.