సంగారెడ్డి: గణనాధుల నిమజ్జనం ప్రశాంతం
NEWS Sep 18,2024 06:21 am
సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువును ఐజి సత్యనారాయణ సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల భధ్రత పరమైన ఏర్పాట్లను చేసినట్లు వివరిస్తూ డ్రోన్ కెమెరా ద్వారా మహబూబ్ సాగర్ చెరువు వద్ద భద్రత దృష్ట్యా గణనాథుని శోభాయాత్ర, ట్రాఫిక్ నియంత్రణ గురించి వివరించారు. అనంతరం ఐజి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, గణనాథుని నిమజ్జనం బుధవారం ఉదయం 10 గంటల వరకు ముగుస్తుందన్నారు.