జగిత్యాల: జగిత్యాల జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. నిమజ్జన సరళిని క్షేత్రస్థాయిలో మంగళవారం బైకుపై వెళ్తూ ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా పరిధిలో పోలీస్ యంత్రాంగం 24/7 పనిచేస్తుందని అన్నారు.