సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ మీదుగా రాయికోడు ప్రధాన కూడలి వద్దకు వెళ్లే ద్విచక్ర వాహనాలతో సహా అన్ని రకాల వాహనాలను అటు వైపుగా వెళ్లకుండా ఆర్ అండ్ బీ అధికారులు మంగళవారం నిలిపివేశారు. రోడ్డుపై పలుచోట్ల సీసీ కల్వర్టులు, చిన్నపాటి వంతెనలు శీతలమై కూలిపోవడంతో పెను ప్రమాదకరంగా మారాయి. అతి త్వరలోనే ప్రమాదకర వంతెనల సమీపంలో తాత్కాలిక రోడ్ల ఏర్పాటును చేయనున్నారు. తాత్కాలిక రోడ్ల ఏర్పాటు అనంతరం వాహనాల రాకపోకలను తిరిగి ఆ రోడ్డుపై కొనసాగించనున్నారు.