నిమజ్జనంను పర్యవేక్షించిన కలెక్టర్
NEWS Sep 18,2024 06:17 am
సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు వద్ద నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతున్న తీరును,జిల్లా కలెక్టర్ క్రాంతి,అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవ్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.నిమజ్జనం శోభాయాత్ర సాఫీగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీసులు,అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తు శోభాయాత్ర తీరును పర్యవేక్షణ చేస్తున్నారన్నారు.ప్రశాంత వాతావరణంలో శోభయాత్ర జరగడం పట్ల పోలీసులను, అధికారులను అభినందించారు.