ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
NEWS Sep 17,2024 06:47 pm
కోరుట్ల: ప్రాథమిక పాఠశాల ఎస్సారెస్పీ క్యాంప్ గడి స్కూల్‌లో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు ఆవిష్కరించారు. పెత్తందారి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఎందరో అమరవీరుల ఫలితమే నేటి ప్రజా పరిపాలన దినోత్సవం అని తెలిపారు. ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్, ధనలక్ష్మి, అల్లే రమేష్ పాల్గొన్నారు.