కొనసాగుతోన్న గణనాథుల నిమజ్జనం
NEWS Sep 17,2024 06:09 pm
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణనాథుల నిమజ్జనం కొనసాగుతూనే వుంది. మంగళవారం రాత్రి వరకు 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు GHMC అధికారులు తెలిపారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546, ట్యాంక్ బండ్ వద్ద 4,730, నెక్లెస్ రోడ్ 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5230, అల్వాల్ కొత్తచెరువులో 6,221 విగ్రహాలను నిమజ్జనం చేశారు. గ్రేటర్‌లో 71 ప్రాంతాల్లో నిమజ్జనం కొనసాగుతోంది. బుధవారం ఉదయం నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు.