మల్యాల మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన ఓటరు జాబితాను పరిశీలిస్తే గతంలో మాదిరిగానే తప్పుల తడకగా ఉంది. మల్యాల పరిధిలో 9800 ఓట్లున్నట్లు అధికారులు జాబితాను విడుదల చేసినప్పటికీ, 2 ఓట్లున్న వ్యక్తి పేర ఒకదానిని, చనిపోయిన వ్యక్తుల పేర్లను తొలగించాల్సి ఉంది. ఇదిలా వుండగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచురించిన ఓటరు జాబితానే ప్రకటించామని, వ్యక్తుల పేర్లు వేర్వేరు వార్డుల్లో ముద్రిస్తే, రెండేసి ఓట్లు ఉంటే తప్పులు సవరిస్తామని మల్యాల గ్రామపంచాయతీ కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ తెలిపారు.