నిజాంసాగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో వచ్చే విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును పొడిగించారు. ముందుగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు ఈనెల 16తో ముగిసింది. అయితే దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడగించారని విద్యాలయం ప్రిన్సిపాల్ సత్యవతి ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.