అల్పాహారంలో లక్క పురుగులు
NEWS Sep 17,2024 05:25 pm
రోగులకు అల్పాహారం కింద అందించిన అటుకుల్లో లక్క పురుగులు రావడం జగిత్యాల ఎంసీహెచ్లో కలకలం రేపింది. రోగులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మాతాశిశు కేంద్రంలో ఇన్పేషంట్లు, వారి సహాయకులకు రోజూ పాలు, బ్రెడ్, అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం అందిస్తారు. అయితే మంగళవారం ఉదయం లక్క పురుగులున్న అటుకులు పెట్టడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ఇంత అధ్వానమా..? ఇదేలా తినేది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.