ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలోని గంగపుత్ర చైతన్య యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద వినాయక లడ్డు వేలం పాటను మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డూని దుబాక గణేష్, త్రివేణి దంపతులు రూ 58,200లకు సొంతం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో ఓ వేలం పాటలో లడ్డును 50 వేలకు పైబడి ధర పలకడం ఇదే మొదటి సారి.