హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్‌లో చైనా, భారత జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచు చూసేందుకు వచ్చిన పాకిస్థాన్ హాకీ బృందం చైనాకు మద్దతు పలికారు. చైనా జెండాలను చేతపట్టు కుని, ముఖానికి చైనా ఫ్లాగ్ రంగులు పూసుకున్నారు. చైనా జెండాలు చేతపట్టుకు న్నారు. ఏ క్రీడలో అయినా ఆటగాళ్లు.. తమను ఓడించిన జట్టుకు ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వరు. కానీ పాక్ హాకీ టీం మాత్రం అందుకు భిన్నం.