సిరిసిల్లలో జిల్లా కేంద్రంలో ఘనంగా నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని బ్రిడ్జి వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేయగా రెండు భారీ క్రేన్లను వినాయక నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. ఈసారి అత్యంత ఎత్తైన గణపతి విగ్రహాలు ఉండడంతో బాహుబలి క్రేన్ల సహాయంతో మానేరు వాగులో నిమజ్జనం చేసారు. నిమజ్జన ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.