ప్రతి ఇంటికి రూ.25 వేలు సాయం
NEWS Sep 17,2024 03:55 pm
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేవారికి రూ.10 వేలు, ఇళ్లలో నీళ్లు వచ్చిన బాధితులకు రూ.10 వేలు ఇస్తామన్నారు. చిరువ్యాపారులకు రూ.25 వేలు ఇస్తామని, నష్టపోయిన MSMEలకు ఆర్థికసాయం అందిస్తామన్నారు. రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్న MSMEలకు రూ.1 లక్ష సాయం, రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న MSME లకు రూ.1.5 లక్షలు అందిస్తామని చెప్పారు.