ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 21 నుంచి 23 వరకు మూడ్రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. విల్మింగ్టన్‌లో జరిగే 4వ క్వాడ్ దేశాధినేతల సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. క్వాడ్ సమావేశానికి అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యమివ్వనున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాల అభివృద్ధి లక్ష్యాలకు, ఆకాంక్షలకు తోడ్పాటు అందించడంపై ఈ క్వాడ్ సదస్సులో చర్చిస్తారు. వచ్చే ఏడాది క్వాడ్ దేశాల సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ అంగీకరించింది.