జగిత్యాల గణేష్ శోభయాత్రలో
బిజెపి ఇరువర్గాల మధ్య వివాదం
NEWS Sep 17,2024 03:50 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలో గణేష్ శోభయాత్ర కొనసాగుతున్న క్రమంలో టవర్ సర్కిల్ వద్ద బిజెపికి సంబంధించిన ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ భోగ శ్రావణి, రవీందర్ రెడ్డి వర్గాల మధ్య మాట పెరిగింది. దీంతో రవీందర్ రెడ్డి వర్గం భోగ శ్రావణి వెళ్ళిపోవాలంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేశారు.